అర్థాలు వెతికినన్నాళ్ళు
అపార్థాలు కనిపిస్తాయి తప్ప
భావాలు మనసులోకి చేరవు!
లోపాలు వెతికినన్నాళ్ళు
దూరాలు పెరుగుతాయి తప్ప
అంతరంగాలు కలిసిపోలేవు!
నీడనివ్వని చెట్టు
ఎంత పెరిగినా లాభం లేదు,
విలువనివ్వని వారి చెంత
ఎంత కాలమైనా వథాయే!
ఎవరి రెక్కలు వారివే
ఎగిరించటం ఇంకొకరి
తరం కాదు,
దారం చేతిలో
ఉన్నంత మాత్రాన
గాలిపటం నీ మాట వినదు
గాలి ఉన్నంత వరకే
దాని పయనం!
అలల పరుగు
తీరం వరకే ఆగిపోయినట్లు,
హదయఘోష
కన్నీటి వరకే ఆగిపోవాలి,
లేదంటే జీవిత పరమార్థం
అర్థాంతరంగా
అంతర్థానమౌతుంది!
– పుట్టి గిరిధర్, 9494962080