వ్యవసాయ కళాశాల సమీపంలో ప్రమాదాల నివారణకు చర్యలు

– రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయనున్న ఎన్.హెచ్ అధికారులు….
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఖమ్మం – అశ్వారావుపేట జాతీయ రహదారి 365 బిబి పై అశ్వారావుపేట ముఖద్వారం లో గల వ్యవసాయ కళాశాల సమీపంలో తరుచు జరిగే ప్రమాదాలను నివారించడానికి ఎన్.హెచ్ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం ఎన్.హెచ్ డి.ఈ సూరిబాబు ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ వ్యవసాయం కళాశాల ప్రదేశంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని కళాశాల అసోసియేట్ డీన్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్ ఇటీవల కళాశాల లో వసతి గృహం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు.ఆ సమయంలోనే మంత్రి సంబంధిత శాఖ అధికారులకు చార్యులు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలకు ఉపక్రమించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధి వై.గోపాలక్రిష్ణ మూర్తి,స్థానిక ఆర్ అండ్ బి ఏ.ఈ రామిశెట్టి శ్రీనివాస్,జె.టి.ఒ శెట్టిపల్లి క్రిష్ణార్జున రావు లు ఉన్నారు.
రంబుల్ స్ట్రిప్స్ అంటే…
వీటినే స్లీపర్ లైన్‌లు లేదా అలర్ట్స్ స్ట్రిప్స్ అని కూడా పిలుస్తారు.వాహనం లోపలి భాగంలోకి చక్రాల ద్వారా ప్రసారం చేయబడే స్పర్శ ప్రకంపనలు మరియు వినిపించే రంబ్లింగ్‌ను కలిగించడం ద్వారా అజాగ్రత్త డ్రైవర్లను సంభావ్య ప్రమాదం గురించి హెచ్చరించడానికి రహదారి భద్రతా లక్షణం.డ్రైవర్లు తమ లేన్ నుండి డ్రిఫ్ అయినప్పుడు వారిని హెచ్చరించడానికి, ఎడ్జ్‌లైన్ లేదా సెంటర్‌లైన్‌ను అనుసరించి ప్రయాణ దిశలో రంబుల్ స్ట్రిప్ వర్తించబడుతుంది. రంబుల్ స్ట్రిప్‌లు ప్రయాణ దిశలో వరుసలో కూడా ఇన్‌స్టాల్ చేయబడవచ్చు , డ్రైవర్‌లను ఆపివేయడం లేదా మందగించడం లేదా సమీపించే ప్రమాదకర ప్రదేశం గురించి హెచ్చరిస్తుంది.

Spread the love