నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఆర్థిక ఇబ్బందులతో సోమారపు ఆశయ్య ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, వారి కుటుంబానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారని బీఆర్ఎస్ దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లి గ్రామంలో ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో సోమారపు ఆశయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఎంపీ దృష్టికి వెళ్లగా … రైతు ఆశయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా నిలవాలని దుబ్బాక మండల బీఆర్ఎస్ నాయకులను ప్రజా ప్రతినిధులను ఎంపీ ఆదేశించారు. ఈసందర్భంగా వారి కుటుంబాన్ని దుబ్బాక బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు కలిసి పరామర్శించారు. తక్షణ సహాయం కింద 10 వేల రూపాయలను వారి కుటుంబానికి అందజేశారు. ఆశయ్య లేని లోటు ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ప్రభుత్వ పరంగా ఎంపీ ఆదుకుంటామని భరోసా కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పర్స సత్యం, బూత్ కన్వీనర్ సంపతి రాజేందర్, గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పర్స దేవరాజ్, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు