మెదక్‌ పార్లమెంటు స్థానంపై వంటేరు దృష్టి

– పరిశీలనలో మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి పేర్లు
నవతెలంగాణ-గజ్వేల్‌
త్వరలోనే జరుగునున్న పార్లమెంటు ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంట్‌ స్థానంపై తెలంగాణ ఫారెస్ట్‌ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి ప్రత్యేక దష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుండి కెసిఆర్‌ పోటీ చేయకపోతే తనకు అవకాశం ఇవ్వాలని అప్పటి మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావుల దష్టికి తీసుకుపోయారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం ఉంటుందని వారు చెప్పుకొచ్చారు. తిరిగి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయిన గజ్వేల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలుపు కోసం వంటేరు ప్రతాప్‌ రెడ్డి రాత్రింబవళ్లు కష్టపడి కషి చేశారు. నియోజకవర్గంలో పట్టున్న నాయకుడిగా వంటేరు ప్రతాప్‌ రెడ్డికి గుర్తింపు ఉంది. మెదక్‌ పార్లమెంటు పరిధిలో గజ్వేల్‌, దుబ్బాక, సిద్దిపేట, మెదక్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, పటాన్చెరువు నియోజకవర్గాలు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో మెదక్‌ మినహా 6 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మెదక్‌లో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు గెలుపొందారు. మెదక్‌ పార్లమెంటు స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంగంలో నిలిపితే గెలిచే అవకాశం మెండుగా ఉంటుందని గత అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు ఓట్లను బట్టి తెలుస్తుంది. 25 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్న వంటేరు ప్రతాప్‌రెడ్డికి పార్లమెంటులో అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు బలంగా కోరుతున్నారు. నర్సాపూర్‌ టికెట్‌ విషయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డికి కాకుండా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డికి ఇవ్వడంతో మదన్‌ రెడ్డికి మెదక్‌ పార్లమెంట్‌ స్థానం ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. మదన్‌ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినందున ప్రతాప్‌రెడ్డికి మెదక్‌ పార్లమెంట్‌ స్థానం ఇవ్వాలని పార్టీ అధిష్టానం దష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు కెసిఆర్‌ను ఒప్పించాలని స్థానిక నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందిన కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఉండి శాసనస భాపక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా పదవికి రాజీనామా చేయకపోవచ్చని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ గజ్వేల్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి రంగంలో వంటేరు ప్రతాప్‌ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన వర్గీయులు గట్టిగా నమ్ముతున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ నుండి ముగ్గురిలో ఎవరు పోటీ చేస్తారో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ముగ్గురిలో ఎవరు పోటీ చేస్తారో!
మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్‌ మాజీ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో మదన్‌ రెడ్డి నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డికి అవకాశం ఇవ్వడం వల్ల మదన్‌ రెడ్డికి టికెట్‌ కావా లని కెసిఆర్‌ను గట్టిగా అడిగారు. మెదక్‌ పార్లమెంట్‌ స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధి కారం లేకపోవడం వల్ల మదన్‌ రెడ్డికి అవకాశం దక్కక పోవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత 25 సంవ త్సరాల నుండి రాజకీయాల్లో ఉన్న ప్రతాప్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ముఖ్యమైన నేతలు కోరుతు న్నారు. రాజకీయ సమీకరణ మూలంగా కేసీఆర్‌ కూడా పోటీ చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తు న్నారు. మెదక్‌ పార్లమెంటు స్థానం నుండి ఎవరిని రంగ ంలో ఉంచితే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌రావు చర్చిస్తున్నట్లు తెలిసింది. మద న్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఇద్దరు బలమైన వ్యక్తులే కావడం వల్ల కెసిఆర్‌ నిర్ణయం ఫైనల్‌గా ఉంటుందని చర్చ జరుగుతోంది.

Spread the love