మేడారం జాతర..రేపే గుడి మెలిగే పండుగ

– జాతర ఘట్టం ప్రారంభం
– సిద్ధమవుతున్న పూజారులు
నవతెలంగాణ- తాడ్వాయి : మేడారం కన్నెపల్లి గ్రామాలలో పూజారులు రేపు బుధవారం గుడి మెలిగే పండుగ ఘనంగా నిర్వహించనున్నారు. మహా జాతరకు రెండు వారాల ముందు ఈ గుడి మెలిగే పండుగ ను చేస్తారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు అత్యంత నియమ నిష్ఠలతో డోలు వాయిద్యాలు నడుమ నిర్వహిస్తారు. పూజారులు వారి ఇండ్లను శుద్ధి చేసుకుని, అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్ట గడ్డిని సేకరించి గుడిపై కప్పుతారు. అనంతరం గుడిలోని వనదేవతను రంగురంగుల ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. గుడి మెలిగే పండగతో వనదేవతల మహా జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. అప్పటినుంచి పూజారులు అత్యంత నియమనిష్టలు పాటిస్తారు. మల్లి వారం 14 తారీకు నాడు వచ్చే బుధవారం రోజున సమ్మక్క గుడిలో మండే మెలిగే పండుగను నిర్వహిస్తారు. దీంతో జాతర ఘట్టం ప్రారంభం అవుతుంది. మేడారం జాతర ఉత్సవాలు ఊపందుకున్నాయి. మళ్లీ వచ్చే మూడవ బుధవారం 21 తారీకు నా జాతర ప్రారంభం కానుంది.
Spread the love