మేడారం జాతర తిరుగువారం మొక్కులు చెల్లించిన సీతక్క 

నవతెలంగాణ – తాడ్వాయి 
మేడారంలో తిరుగువారం పండుగ బుధవారం సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఘనంగా తిరుగువారం మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా జాతర ముగిసిన అనంతరం కూడా మేడారం జాతరకు భక్తులు తమ భక్తులను చెల్లించుకుంటున్నారని రెండు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని తిరుగువారం పండుగతో మేడారం మహా జాతర సమాప్తం అవుతుందని అనంతరం మేడారం మహా జాతరకు సంబంధించిన చిన్న జాతరలు మొదలవుతాయని తెలిపారు. మేడారంలో నిరంతరం పారిశుధ్య పనులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఏ ఎస్ పి సిరి శెట్టి సంకిర్త్  ,జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డి.ఎస్.పి రవీందర్, డి ఎల్ పి ఓ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love