ఆన్ లైన్ లో మేడారం ప్రసాదం బుకింగ్

– బాన్సువాడ డిపో మేనేజర్ సరిత దేవి
నవతెలంగాణ – మద్నూర్
టీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం బంగారంమేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ శుభవార్త చెప్పింది. ఇప్పుడు ఇంటి వద్దనుండే మేడారం బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రసాదం బుకింగ్ చేసుకోవాలి అనుకునే భక్తులు బాన్సువాడ డిపో పరిధిలోని బాన్సువాడ , పిట్లం , బిచ్కుంద , నిజాంసాగర్ , బిర్కూర్ , మద్నూర్ , పెద్దకొడప్గల్ కౌంటర్లకు విచ్చేసి బుకింగ్ చేసుకోవచ్చు , లేదా 9154298729 , 9392898164 నెంబర్ కి సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చు , జాతర  అనంతరం ప్రసాదాన్ని భక్తులకు డోర్ డెలివర చేయబడుతుందని  బాన్సువాడ డిపో మేనేజర్ సరిత దేవి ఒక ప్రకటన ద్వారా  తెలియజేశారు.
Spread the love