శ్రీ బాలాజీ క్లినిక్‌లో వైద్య శిబిరంఅ రోగాలపై అవగాహన, జాగ్రత్త లేక అకస్మాత్తుగా గుండె రోగాలు

– వచ్చే పది సంవత్సరాలలో గుండె జబ్బులు ఎక్కువ అయ్యే అవకాశం
– డాక్టర్‌ కే. సందీప్‌ చిన్న పిల్లల వైద్య నిపుణులు, శ్రీ బాలాజీ క్లినిక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
వికారాబాద్‌ పట్టణంలోని బిటిఎస్‌ కాలనీలో శ్రీ బాలాజీ క్లినిక్‌లో సోమవారం వైద్య శిబిరం నిర్వహిం చారు. డాక్టర్‌ కే.సందీప్‌ మాట్లాడుతూ ఈ మధ్యకా లంలో చిన్న వయసు ఉన్నవారు అకస్మాత్తుగా చనిపో తున్నారని మనిషి సమాజంలో పరిస్థితులకు అనుగు ణంగా పరిగెడుతూ ప్రతి ఒక్కరూ ఇతర పనులపై పెట్టిన శ్రద్ధ తమ ఆరోగ్యంపై పెట్టడం లేదని చిన్న విషయాలకు తీవ్రంగా ఆలోచించడం పరిమితికి మించి అదనపు భారాలు వేసుకోవడం వలన వాటిని చక్కదిద్ద లేని పరిస్థితు ల్లో మనుషులు జీవించి అనేక విష యాలు ఇతరులతో పంచుకోవడం వలన తీవ్రమైన ఒత్తిడితో మనిషి జీవించడం ద్వారా ఆ ప్రభావం గుం డెపై పడుతుందన్నారు. ఈసీజీ,2 %ణ జుషష్ట్రశీ%, పాటు షుగర్‌ పరీక్షలు, రక్త పరీక్షలు ప్రతి మూడు నెలలకు ఒకసారి చేసుకోవాలని శరీరంలో ఎలాంటి రోగం వస్తుందో అవగాహన లేక అకస్మా త్తుగా అనేక రోగాలకు గురి అవుతున్నారని గుండె, అవయవాల పరీక్షలు సరిగ్గా చేసుకోకపోవడం శారీరక శ్రమ లేకపోవడం వలన ప్రాణాలు కోల్పో వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంద న్నారు. పట్టణంలో టుడీ ఈకో, అందుబాటులో లేనం దున ఉచితంగా నిర్వహించామని ఈసీజీ పరీక్షలు 114 మందికి చేశామని ఈకో 89 రక్త పరీక్షలు 129 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని రోగు ల పరిస్థితిని బట్టి ఉచిత మందులు ఇచ్చి సహకా రమందిస్తు న్నామని ఆయన అన్నారు. తెలంగాణలో వచ్చే పది సంవత్సరాలలో గుండె జబ్బులు ఎక్కువ అయ్యే పరిస్థితులు కనబ డుతున్నాయని దీనికి కారణం ప్రజలు ఫాస్ట్‌ ఫుడ్‌ను ఎక్కువ తీ సుకోవడం ద్వారా నిరంతరం కూర్చుని ఉండి పనిచేయడం వల న సెల్ఫోన్‌ ఎక్కువ ఉపయోగించడం ద్వారా ధూమపానం, మద్యపానం, మానసి క ఒత్తిడి, వీటి ద్వారా గుండె జబ్బులు ఎక్కువ అయ్యే పరిస్థితులు ఉన్నాయని వయసు తక్కువ ఉన్న వారు కూడా మద్యపానం తీసుకోవడం ద్వారా అవ యవా లు తొందరగా దెబ్బతినే పరిస్థితిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్థోపెడిషన్‌ డాక్టర్‌ అభిషేక్‌, గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ లావణ్య, షుగర్‌ వ్యాధి నిపు ణులు డాక్టర్‌ హర్ష, నరాల నిపుణులు డాక్టర్‌ శ్యామ్‌ జైశ్వాల్‌ బాలాజీ క్లినిక్‌ సిబ్బంది తదితరుల్గన్నారు.

Spread the love