నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని తెలంగాణ ముస్లిం మైనారిటీ కళాశాల లో అశ్వారావుపేట( వినాయకపురం) పీహెచ్సీ వైద్యాధికారి రాందాస్ నాయక్ పర్యవేక్షణలో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. జ్వరం తో బాధపడుతున్న నలుగురు విద్యార్థినిలు కు మలేరియా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.ఇందులో ఎవరికీ మలేరియా సోకినట్లు (పాజిటివ్ ఫలితాలు) నిర్ధారణ కావడం తో సాదారణ జ్వరాలకు ఇచ్చే మందులు అందజేసారు.మరో పది మందికి కాలానుగుణంగా వచ్చే చిరు వ్యాధులకు చికిత్స లు అందజేశారు.మరో ఇద్దరు విద్యార్థినులకు కండ్లకు సంబంధించిన చికిత్సలు అవసరం అని కళాశాల యాజమాన్యం కి తెలియజేశారు. ముఖ్యంగా ఈ వర్షా కాలంలో కాచి చల్లార్చి న నీరు తాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు.ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వెంటనే మా వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ వైద్య శిబిరం లో హెల్త్ విజిటర్ దుర్గమ్మ,హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్,ఆశా అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.