నవతెలంగాణ – కంటేశ్వర్
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికై పోరాటం చేస్తూనే, సామాజిక బాధ్యతగా, సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మన సంఘం పక్షాన మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగానే 26 వ తేదీ (సోమవారం) నాందేవ్ వాడలోని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ భవనంలో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నాము అని అధ్యక్షులు రామ్మోహన్రావు, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ కోశాధికారి ఈవీఎల్ నారాయణ, బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రధానంగా క్యాన్సర్ డిటెక్షన్ టెస్టులు కూడా ఉంటాయి. వేలాది రూపాయలు ఖర్చు తో కూడిన ఈ టెస్టు లను ఉచితంగా చేయబడుతున్నాయి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. క్యాన్సర్ అనేది మూడో స్టేజి దాకా తెలియటం లేదు. కావున ముందుగానే బ్లడ్ శాంపిల్స్ తో టెస్ట్ లు ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ క్యాంపులు మొదటి రోజున 26 వ తేది మన ఆఫీసులో,27వ తేదీ అర్సపల్లి నందు 28 వ తేదీ నాగారం (బహుజన కాలనీలో) నిర్వహిస్తున్నాము. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని , మీ బంధువులు, స్నేహితులు, ఎవరినైనా క్యాంపుకు తీసుకొని రావచ్చు. ఎలాంటి ఫీజులు వసూలు చేయబడవు.