మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ) 13 మంది సభ్యుల ఎన్నికల కోసం రిటర్నింగ్‌ అధికారి వి.శ్రీహరిరావు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నామినేషన్‌ పేపర్లను ఈ నెల 18 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు పంపిణీ చేస్తారు. ఈ నెల 21 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 8న నామినేషన్లను పరిశీలిస్తారు. స్క్రూటినీ అనంతరం పోటీకి అర్హమైన నామినేషన్ల వివరాలను అదే రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తారు. సెప్టెంబర్‌ 30 నుంచి నవంబర్‌ 15 వరకు బ్యాలెట్‌ పేపర్లను పంపిణీ చేసీ, నవంబర్‌ 30 వరకు వాటిని స్వీకరిస్తారు. డిసెంబర్‌ ఒకటిన వాటి లెక్కింపును చేపడతారు.

Spread the love