భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య పరీక్షలు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
భవన నిర్మాణ, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సిఎస్‌సి హెల్త్ కేర్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ ప్రవీణ్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం లో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ కార్మికులుసంపూర్ణ ఆరోగ్యవంతులుగాఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలనునిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్‌సి) హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు కలిగిన నిర్మాణ రంగం కార్మికులకు 52 రకాల వైద్య పరీక్షలు ఉచితంగానే చేయనున్నట్లు తెలిపారు. కార్మిక సంక్షేమ శాఖ జారీ చేసిన లేబర్ కార్డు ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు అర్హులని తెలిపారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.వైద్య పరీక్షలకు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కూలీ పని, తాపీ మేస్త్రీ, ఫ్లంబర్, టైల్స్, పాల్ సీలింగ్, ఎలక్ట్రిషన్, కార్పెంటర్, పేయింటర్స్, బ్రిక్స్ వర్కర్స్, గ్లాస్ వర్కర్స్ తదితర కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, భవన నిర్మాణాల సంఘం అధ్యక్షుడు రాములు, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సిఎస్సి జిల్లా ఇన్చార్జ్ ప్రవీణ్ నాయక్ వారి సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love