నవతెలంగాణ-ముత్తారం : ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ విద్యార్థినీలకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఈ పాఠశాలకు చెందిన 53 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం విధితమే. అయితే మళ్లీ కొంత మంది విద్యార్థినీలకు దగ్గు రావడంతో కస్తూర్భా స్పెషల్ ఆఫీసర్ స్వప్న అధికారులకు తెలియజేసింది. దీంత లో మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థినీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు మాట్లాడుతూ విద్యార్థినీలు దగ్గుతో బాధ పడుతుండం వారిని పరీక్షలు నిర్వహించామని, వీరందరికీ కాలానుగణంగా వచ్చే వ్యాధుల్లో భాగంగా దగ్గు వస్తుందని నిర్ధారణ అ య్యిందని తెలిపారు. వీరికి మందులను అందజేసినట్లు తెలిపారు.