– ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో వైద్య రంగంలో వినూత్న విప్లవాత్మక మార్పులు
– ఆరోగ్య తెలంగాణ లక్షంగా అడుగులు
– ప్రభుత్వ ఆసుపత్రిల లో కార్పొరేట్ వైద్యం
– కోవిడ్ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో విశిష్ట సేవలు అందించిన వైద్య సిబ్బంది
– మీ సేవలు వెలకట్టలేనివి-మీరు చేసే సేవలకు నా సెల్యూట్
– వైద్య ఆరోగ్య దినోత్సవం లో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల న్యూ అంబేద్కర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవం లో బుధవారం పాల్గొన్నారు.వైద్య ఆరోగ్య దినోత్సవం లో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యం లో వైద్య రంగం లో తీసుకవచ్చిన విప్లవాత్మక మార్పుల వలన తెలంగాణ వైద్య రంగం దేశంలో మొదటి స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు కేసీఆర్ కిట్,న్యూట్రిషన్ కిట్,ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే 12000 రూ.ఆరోగ్య లక్ష్మీ పథకాలు వల్ల మరియు వైద్య సిబ్బంది కృషి తో ప్రభుత్వ ఆసుపత్రిలపై ప్రజలలో నమ్మకం పెరిగింది.ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్య సదుపాయాలు మెరుగుపరచటం తో ప్రయివేట్ ఆసుపత్రిలకు ధీటుగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నాము. ప్రభుత్వ ఆసుపత్రిలలో సాధారణ ప్రసవాలు పెరిగాయి.గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడం వల్ల మాత శిశు మరణాలు తగ్గాయి.తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా సామాజిక ఆరోగ్య కేంద్రాలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,జిల్లా సాధారణ ఆసుపత్రిలలో 60 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. మహిళల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది. భవిషత్తు లో అన్ని ఆసుపత్రిలలో ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నాము.అమ్మఒడి పథకం ద్వారా గర్భిణీ స్త్రీలను,శిశువులను సమయానికి ఆసుపత్రి తీసుకెళ్లడం కోసం రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అంగన్ వాడి కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు,పాలిచ్చే తల్లులకు పోషకాహారం తో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాము.తద్వారా తెలంగాణ రాష్ట్రంలో మాత శిశు మరణాలు తగ్గాయి.కరోన కష్ట కాలం లో హెల్త్ సిబ్బంది విశేష సేవలు అందించారు.వారికి బయట మంచి నీళ్లు కూడా దొరకని సందర్భం లో మన కోసం పని చేస్తున్న సిబ్బందికి వారు పని చేస్తున్న చోటునే భోజనం వితరణ చేశాము. ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు పడుతున్న కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచారు.మీరు చేసిన సేవలను గుర్తించి ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది.ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో వైద్య సిబ్బంది కృషితో తెలంగాణ వైద్య రంగం దేశానికి దిక్సుచి గా మారిన శుభ సందర్భంగా, వైద్య ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.వైద్య రంగం లో మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ,మహిళ కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ ,ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు డా. ప్రతిమ రాజ్ రెడ్డి ,ప్రిన్సిపాల్ డా. ఇందిరా, డి ఎం హెచ్ ఓ డా.సూదర్శనం బి ఆర్ ఎస్ కార్పొరేటర్ లు,నాయకులు పాల్గొన్నారు.