ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు

నవ తెలంగాణ- గజ్వేల్‌
ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు తీసుకురావడానికి కషి చేస్తున్నామని గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నేతి చిన్న రాజమౌళి అన్నారు. శనివారం మున్సిపల్‌ పరిధిలోని ఆరో వార్డు సంగుపల్లి గ్రామంలో స్థల పరిశీలన చేశారు. వైద్య సబ్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తామన్నారు. సబ్‌ సెంటర్‌ ను నిర్మాణం చేపట్టేందుకు స్థలాన్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు. సంగుపల్లి గ్రామంలో నిర్మాణం చేపట్టినట్లయితే 6 ,7 వార్డుల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య సేవల పట్ల మరింత శ్రద్ధ తీసుకుంటుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మున్సిపల్‌ కేంద్రాల్లో బస్తీ దావఖానలు, సబ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్య సేవలు విస్తతం చేస్తుందన్నారు. ప్రజలకు కావలసిన అన్ని ఆరోగ్య సమస్యలు తీర్చేందుకు తగిన సౌకర్యాలు ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విద్యాధర్‌, వైస్‌ చైర్మన్‌ జకీర్‌, కౌన్సిలర్‌ రజిత గౌడ్‌, గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love