తమకు రక్షణ కల్పించాలని కోరుతూ జన్నారం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా వారు శనివారం జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిపై అఘాయిత్యాలను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్త్ సూపర్వైజర్స్ కమలాకర్ పోషన్న జంగమ్మ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.