వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి..

Medical staff should be punctual.– సమీక్ష సమావేశంలో వైద్యాధికారి వినయ్ భాస్కర్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని  ఆరోగ్య ఉపకేంద్రాల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికారి వినయ్ భాస్కర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు.గురువారం మండల  ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మండలంలో కుష్టు వ్యాధిగ్రస్తులపై పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవాలందించాలన్నారు.లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇటీవల ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వినయ్ భాస్కర్ కు సిబ్బంది శాలువాతో  ఘంసంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిడిఓ సందీప్, మెడికల్ ఆపిసర్ రాజు,సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love