వైద్య విద్యార్థినిపై జరిగిన ఘోరానికి నిరసన తెలిపిన వైద్య సిబ్బంది

Medical staff who protested against the incident on the medical studentనవతెలంగాణ – రెంజల్ 
వైద్య పీజీ విద్యార్థిని పై అత్యాచారం, ఆపై హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, శనివారం రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పల్లె దావఖాన కూనపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. ఈ సంఘటనపై సుప్రీం కోర్ట్ సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడే వైద్యులపై అత్యాకాండలు జరపడం శోచని ఏమన్నారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోదిత, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపే రవీందర్, చింతల శ్రావణ్ కుమార్, సూపర్వైజర్ మాలంబి, ఫార్మసిస్ట్ మోయిజ్, ఆరోగ్య కార్యకర్త కళావతి, ఎంహెచ్ఎల్పి లు ఇర్ఫాన్ ,లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love