ఖమ్మంలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్య

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మంలోని ఓ వైద్య కళాశాల విద్యార్థిని ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని మెడికల్‌ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న సముద్రాల మానస (22) అదే కళాశాల ఎదురుగా ఉన్న హాస్టల్‌ గదిలో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందినట్టు ఖమ్మం అర్బన్‌ పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె స్వస్థలం మహబూబాబాద్‌ అని పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాతనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఎస్‌ఐ శ్రావణ్‌ కుమార్‌ విచారణ చేస్తున్నారు.

Spread the love