పలాస వైద్య విద్యార్థిని ఆత్మహత్య

నవతెలంగాణ – అమరావతి
నెల్లూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(23) అనే వైద్య విద్యార్థిని నెల్లూరు నగర పరిధిలోని చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న నారాయణ మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ హౌస్‌ సర్జన్‌ చేస్తోంది. ఆమెకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ రోజు ఉదయం కళాశాల హాస్టల్‌ గదిలో చైతన్య బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love