అత్యంత ప్రభావశీల కంపెనీల్లో మీషో

హైదరాబాద్‌: ‘టైమ్‌ 100 అత్యంత ప్రభావ శీల కంపెనీలు 2023’ జాబితాలో మూడు దేశీ య కంపెనీలు ప్రతిష్టాత్మక సంస్థలు చోటు దక్కిం చుకున్నాయి. అందులో మీషో ఒక్కటి ఉంది. అంతర్జాతీయంగా స్కిమ్స్‌, ఎన్‌విడియా, స్పేస్‌ ఎక్స్‌, ఆపిల్‌, ఓపెన్‌ఎఐ వంటి దిగ్గజ కంపెనీల సరసన తాము నిలిచినట్లు మీషో తెలిపింది. ”ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలలో ఒకటిగా టైమ్‌ ద్వారా గుర్తించబడినందుకు మేము గర్వపడుతున్నాము. ఇది మొత్తం దేశానికి గర్వకారణం. ఇది జట్టు మొత్తం కృషి, సంకల్పం. మా సాధికారత ను కొనసాగిస్తాము.” అని మీషో వ్యవస్థాపకుడు విదిత్‌ ఆత్రే పేర్కొన్నారు.

Spread the love