రేపే తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈనెల 6వ తేదీ (శనివారం) కీలకమైన సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను స్నేహపూరిత వాతావరణంలో పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు భద్రాచలాన్ని ఆనుకొన్ని ఐదు గ్రామపంచాయతీల విలీనం అంశం కూడా సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతోపాటు పౌరసరఫరాలశాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా ప్రస్తావనకు రానున్నట్లు తెలిసింది.

Spread the love