నేడు ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు టీపీసీసీ సీనియర్ నేతలు సమావేశం కానున్నారు. ఈ నెల 26న చేవెళ్లలో జరగనున్న బహిరంగ సభతో పాటు పలు అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ విడుదల చేయనుంది. అలాగే ఈ నెల 29న వరంగల్‌లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేసే ఆలోచనలో టీపీసీసీ నేతలు ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత మహిళా డిక్లరేషన్ కూడా విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహిళా డిక్లరేషన్ విడుదలకు ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నారు. కాగా ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్లను టీపీసీసీ విడుదల చేసింది. మల్లికార్జున ఖర్గేతో భేటీలో కొత్తగా పార్టీలో చేరికల అంశంపై కూడా టీపీసీసీ నేతలు చర్చించనున్నారు.

Spread the love