నవతెలంగాణ -డిచ్ పల్లి
అంటు వ్యాధులను అరికట్టడంలో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. యాదగిరి ఆదేశాల మేరకు యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్లో మెగా మెడికల్ క్యాంపును మంగళవారం ప్రారంభించారు.ఈ మెగా క్యాంపు ప్రారంభం సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ అనారోగ్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. యూనివర్సిటి అందించే ఈ సేవలను విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది వినియోగించుకోవాలని పేర్కొన్నారు. డాక్టర్ సుజాత మాట్లాడుతూ కళ్ళకలక జ్వరము తలనొప్పితో పాటు తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని వివరించారు. దీనివలన కళ్ల వెంట నీరు కారడం, కళ్ల మంటలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన వారు మాస్కులు, కళ్లద్దాలు విధిగా ధరించాలని పేర్కొన్నారు.వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఏడు రోజుల వరకు ఐ సొల్యూషన్ లో ఉండాలని సూచించారు.ఈ మెగా మెడికల్ క్యాంపును విద్యార్థులకు కళ్ళ కలక నివారణ ఉపాయాన్ని తెలిపారు. అనంతరం సుమారు 100 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి చుక్కల మందులు టాబ్లెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత(ఆప్తమాలజిస్ట్),డాక్టర్.రాజేశ్వర్(పల్మనాలజిస్ట్ ) పాల్గొన్నారు. ఈ మెగా క్యాంపులో కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ ఆరతి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్.కే.సంపత్ కుమార్, సుజాత (ఏఎన్ఎం ), ఎస్టేట్ ఆఫీసర్లు అశోకవర్ధన్ రెడ్డి, యాదగిరి తదితర బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని చీప్ వార్డెన్ డాక్టర్ మహేందర్ రెడ్డి సమన్వయం చేయగా హాస్టల్ వార్డెన్స్ డాక్టర్ గంగా కిషన్ డాక్టర్ కిరణ్ రాథోడ్ ఏర్పాట్లను పరిశీలించారు.