నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. గురువారం రాత్రి సతీమణి సురేఖతో కలిసి ప్రజాభవన్‌కు వచ్చిన చిరంజీవి.. అక్కడ డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి దంపతులకు డిప్యూటీ సీఎం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని చిరంజీవి శాలువాతో సత్కరించారు. అనంతరం చిరంజీవి దంపతులకు సైతం భట్టి సత్కారం చేశారు. చిరుతో భేటీకి సంబంధించిన ఫొటోలను డిప్యూటీ సీఎం తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని ప్రజాభవన్ లో కలిసిన ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారి దంపతులు@KChiruTweets #BhattiVikramarkaMallu #Chiranjeevi pic.twitter.com/m11XTpPBsX
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 4, 2024