భద్రాచలంలో మేఘా గ్యాస్‌ సేవలు ప్రారంభం

హైదరాబాద్‌ : భద్రాచలం పట్టణంలో మేఘా గ్యాస్‌ సేవలను ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. భద్రాచలం ఆర్‌టిసి బస్టాండ్‌ పక్కన ఉన్న వాణి పెట్రోల్‌ బంక్‌లో మేఘా గ్యాస్‌ సిఎన్‌జి స్టేషన్‌ను ఫిల్లింగ్‌ స్టేషన్‌ యాజమాని వాణి కుమారి, మేఘా గ్యాస్‌ ఖమ్మం ఇంచార్జ్‌ వంశీ శనివారం లాంచనంగా ప్రారంభించారు. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5వ సిఎన్‌జి స్టేషన్‌ అని మేఘా గ్యాస్‌ సంస్థ తెలిపింది. హెచ్‌పిసిఎల్‌కు చెందిన వాణి ఫిల్లింగ్‌ స్టేషన్లో ఇక నుంచి మోటార్‌ వాహనాలకు అవసరమైన మేఘా గ్యాస్‌ ను విక్రయిస్తారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఆరు సిఎన్‌జి ఔట్‌లెట్లను తెరువనున్నామని వంశీ తెలిపారు. మేఘా గ్యాస్‌ దేశంలోని 10 రాష్ట్రాల్లోని 64 జిల్లాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు.

Spread the love