నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని పలు గ్రామాలలో రోడ్ల నిర్మాణం కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడంతో శుక్రవారం జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మేకల ప్రమోద్ రెడ్డి ఢిల్లీలోని ఎమ్మెల్యే నివాసంలో రాజగోపాల్ రెడ్డిని పుష్పగుచ్చం అందించి సాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే రాజన్న లక్ష్యం అని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ఆయాంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉంచారని మండిపడ్డారు. రాబోయే నాలుగేళ్లలో అభివృద్ధికి అడ్డం పట్టేలా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కానుందని ధీమా వ్యక్తం చేశారు.