నవతెలంగాణ-గాంధారి : గాంధారి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గ సభ్యులు మంగళవారం కరీంనగర్ జిల్లా ములకనుర్ సహకార సంఘoఅభివృద్ధి గురుంచి తెలుసుకొనేందుకు బయలు దేరి వెళ్ళారు ములకనూరు సహకార సంఘంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు ములకనూరు సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైస్ మిల్, బిన్నీగ్ మిల్,డైరీ, పురుగు మందుల దుకాణం,ప్రేట్రోల్ పంపులను పార్శీలించినట్లు చెర్మెన్ సాయికుమార్ తెలిపారు అలాగే ములకనూరు సొసైటీ అభివృద్ధికి సొసైటీ వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకునట్లు చెర్మెన్ తెలిపారు ఈ కార్యక్రమంలో చెర్మెన్ సాయికుమార్, డైరెక్టర్లు అశోక్ రెడ్డి, తాడ్వాయి సంతోష్, గండ్లలక్ష్మన్, ఉదల్ సింగ్, శివాజీరావు,గణేష్ రావు, పొచెయ్య, నెహ్రు, సిఈవో మోహన్ రెడ్డి సిబ్బంది సాయిలు తదితరులు ఉన్నారు.