మానవతా సదన్ ను సందర్శించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు..

నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలో ఉన్న మానవత సాధన్ ను గురువారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిజామాబాద్ ఛైర్పర్సన్  సంపూర్ణ, సబ్యులు  శోభా, రాజేంద్రప్రసాద్ సందర్శించారు. మానవత సదన్ పిల్లలతో సమావేశం ఏర్పాటు చేసి వారితో విద్య, ప్రాముఖ్యత పై వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడారు.  ఆడపిల్లలతో  ప్రత్యేకంగా ఌ మాట్లాడారు.డెంగ్యూ వైరస్ అధికంగా వున్నందున పరిసరాలను  శుభ్రంగా ఉంచాలని సూచించారు. మానవత సదన్ ను చేత్త చేదరం లేకుండా  శుభ్రంగా ఉంచుకున్నందు కు పిల్లలను  అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో చదువుకున్న అమ్మాయిలు, అబ్బాయి వివరాలు తెలుసుకున్నారు.మానవత సదన్ సిబ్బంది తోసమావేశం ఏర్పాటు చేసి పిల్లల కోసం చిత్త శుద్ధితో పని చేస్తున్ననందుకు సిబ్బందిని అభినందించారు.
Spread the love