నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లి, బొల్లెపల్లి గ్రామాలను నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం సభ్యులు ఎస్ అర్జున్, ఎస్ సు హైబు లు సందర్శించి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులను రికార్డులను తనిఖీ చేశారు. గ్రామాలలో పెన్షన్ దారులను, ఉపాది హామీ కూలీలను అడిగి వివరాలను తెల్సుకున్నారు. మహిళా సంఘాల సభ్యుల పనితీరు, రికార్డులను తనిఖీ చేశారు. ప్రదాన్ మంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద చేయబడిన రోడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమములో ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్, ఎంపీఓ దినాకర్, పంచాయతి రాజ్ ఎఈ ప్రసాద్, ఏపిఓ బాలస్వామి, ప్లాంటేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇనాయత్ అలి, బొల్లేపల్లి పంచాయతీ కార్యదర్శి పద్మా రెడ్డి, ఎర్రంబెల్లి పంచాయతీ కార్యదర్శి హేమలత, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపి ఏపీఎం అంజయ్య లు పాల్గొన్నారు.