ఎమ్మెల్యేను కలిసిన అర్చక సంఘం సభ్యులు

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
జీహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న 100 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం మంజూరైన నేపథ్యంలో అర్చక సంఘం సభ్యులు గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కృషితో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న 75 దేవాలయాలకు ఈ పథకం మంజూరైన నేపథ్యంలో అర్చక సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు శ్రీరంగం గోపికష్ణమాచార్యులు, రఘు స్వామి, చంద్రప్రకాష్‌ , శివకుమార్‌ పాల్గొన్నారు.

Spread the love