– ఓయూ జేఏసీ కోఆర్డినేటర్, జాతీయ మాలల ఐక్య వేదిక, నిర్మల్ జిల్లా కార్యదర్శి ~ M రాహుల్ (P.hD Scholar)
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ ఉద్యమకారుడు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు గురించి రెండు రోజులు నిరాహార దీక్ష చేశారు. అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాడానికి కృషి చేశారు. ఇలాంటి గొప్ప నాయకుడు, ఉద్యమకారుడు. కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా మందికి సహాయ సహకారాలు చేస్తూ, మహాత్మా జ్యోతి భాఫూలే, డా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన లను ముందుకు తీసుకుపోతున్న గొప్ప నాయకుడు, చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్ కి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని ఓయూ జేఏసీ కోఆర్డినేటర్, జాతీయ మాలల ఐక్య వేదిక- నిర్మల్ జిల్లా కార్యదర్శి M రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అనంతరం మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమ్,లక్ష్మణ్,కిరణ్… తదితరులు పాల్గొన్నారు.*