– వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం
నవతెలంగాణ- జమ్మికుంట
వాసవి వనిత క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా జమ్మికుంట వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మంగళవారం ఆ క్లబ్ సభ్యులు మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు మద్ది లావణ్య సంపత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో వివిధ సేవా కార్యక్రమాలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని సన్మానించడం ఆనవాయితీగా వస్తుందని ఆమె తెలిపారు. అందులో భాగంగానే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయురాలు అయిత రాధికను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగిందని ఆమె అన్నారు. ఈ వ్యవస్థ నేడు లక్ష మంది సభ్యులతో, సుమారు రెండు వేల క్లబ్బులతో విశేష సేవలు అందిస్తుందని ,భవిష్యత్తులో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు అందిస్తామని ఆమె తెలిపారు