న్యూట్రిషన్ ఫుడ్ తో మానసిక ఆరోగ్యం..

– డిస్ట్రిక్ట్ 2వ గవర్నర్ డా.జి.మహేంద్ర కుమార్ రెడ్డి, పద్మా కమలాకర్
నవతెలంగాణ-హైదరాబాద్ :
న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు ఇవ్వడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని డిస్ట్రిక్ట్ 2 వ గవర్నర్ డా.మహేంద్ర కుమార్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల వెనుక ఉన్న భవిత సెంటర్(మానసిక వికలాంగులు స్కూల్లో) పళ్ళు, గుడ్లు, న్యూట్రిషన్ ఫుడ్, పుస్తకాలు మంగళ వారం ఉదయం 11 గం.టలకు డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్,నవభారత లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సైకియాట్రిస్ట్ డా.జి.మహేంద్ర కుమార్ రెడ్డి, లయన్ అంజయ్య,జోనల్ చైర్ పర్సన్ లయన్ సి.హెచ్. గోపాలకృష్ణ, అధ్యక్షుడు బెల్లం కొండ వినయ్, పి.స్వరూపా రాణి, బి.వనిత,డా.హిప్నో పద్మా కమలాకర్ , స్కూల్ హెచ్ ఎమ్ . స్వరూపా రాణి, విజయ లక్ష్మి పిల్లలకు పంచడం జరిగింది.ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. వారి వైకల్యం ఫలితంగా వారి ఆరోగ్యం తరచుగా ఇబ్బంది పడుతుంటారన్నారు. తగినంత పోషకాహారం అందించడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, స్థిరత్వం కొంత వరకూ ఉంటుందన్నారు. స్కూల్‌లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి అదనపు ప్రయత్నం చేస్తామన్నారు. పోషకాహారంతో పాటు ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలన్నారు. వీటితోపాటు పండ్లు తరచూ తీసుకుంటూనే వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తుంటే శరీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారని తెలిపారు.

Spread the love