క్రీడలతో మానసిక ఉల్లాసం


– యువత క్రీడల్లో, సేవ కార్యక్రమాల్లో ముందుండాలి
– దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ మల్హర్ రావు: క్రీడలతో మానసికొల్లాసం ఉంటుందని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.గురువారం మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీపాద కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యువత క్రీడలు, సేవ కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుఢ్యానికి.దోహదపడతాయన్నారు. గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకొని చక్కని ఆట తీరును కనబరచాలన్నారు. క్రికెట్ టోర్నీ విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి తరం యువత విద్యతోపాటు క్రీడారంగంలో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. తల్లిదండ్రులకు ఉన్న ఊరికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Spread the love