వీడియో రికార్డు సాంగ్‌ ఆవిష్కరణ : ఎంఈవో

నవతెలంగాణ-శంకర్‌పల్లి
శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో మంగళవారం బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి జన్వాడ వార్డు సభ్యులు గౌడిచర్ల వెంకటేష్‌ రచించి పాడిన వీడియో రికార్డును ఎంఈఓ సయ్యద్‌ అక్బర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్వాడ గ్రామంలో గౌడ్‌ చర్ల వెంకటేష్‌ మంచి రచయిత, గాయకుడని అభి నందించారు. స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులపై చిత్రీకరించి, పాట పాడటం చాలా బాగుందన్నారు. గ్రామ స్తుల సమక్షంలో వీడియో ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love