జుకర్‌బర్గ్‌ పై అసంతృప్తి

న‌వ‌తెలంగాణ హైద‌రాబాద్: మెటా సీఇఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. ఆయన నాయకత్వంపై 74 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంఖ్య ఐదు శాతం క్షీణించినట్లు తెలిపింది. ఈ మేరకు మెటా నిర్వహించిన సర్వే వివరాలను స్థానిక మీడియా విడుదల చేసింది. నివేదిక ప్రకారం మెటా ఉద్యోగులలో 26 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. వేలాది మంది ఉద్యోగులను తొలగించిన రెండు నెలల తర్వాత ఏప్రిల్‌ 26- మే 10 మధ్య నిర్వహించిన ఈ సర్వేను చేపట్టినట్లు తెలిపింది. నాలుగింట ఒక వంతు మంది అంటే 26 శాతం మంది మాత్రమే మార్క్‌ జుకర్‌బర్గ్‌ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు. ఇది అక్టోబర్‌లో 58 శాతం నుండి 5 శాతం క్షీణించి 43 శాతానికి పడిపోయినట్లు నివేదిక తెలిపింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా మెటా సీఇఓ జుకర్‌ బర్గ్‌ అనేక దశల్లో 21వేలకు పైగా ఉద్యోగులను తొలగించారు. అలాగే సంస్థ ఆర్థిక పనితీరును, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు తక్కువ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను రద్దు చేయడంతో పాటు ఉద్యోగుల నియామకాలను కూడా తగ్గించారు. ఈ ఆకస్మిక తొలగింపులు మెటాలో పనిచేస్తున్న వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love