ముంబయి : కోటి మంది చిన్న వ్యాపారులకు మద్దతును అందించడానికి కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మెటా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా 17 నగరాలకు చెందిన చిన్న వ్యాపారాలకు డిజిటలైజేషన్లో సాధికారిత కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇందుకోసం మెటా తమ వాట్సాప్ బిజినెస్ యాప్‌లో ‘వాట్సప్ సే వ్యాపార్’ కార్యక్రమయం ద్వారా స్థానిక వ్యాపారులకు డిజిటల్‌గా శిక్షణ ఇచ్చేందుకు, నైఫుణ్యాభివృద్థి మద్దతును అందించనున్నట్లు పేర్కొంది. చిన్న వ్యాపారాలు తమ వినియోగదారులతో సమర్ధవంతంగా అనుసంధానం అయ్యేందుకు ఇది దోహదం చేయనుందని మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ పేర్కొన్నారు.