మెట్రో కోచ్ లను పెంచాలి..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని నగరవాసులు సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. మెట్రోలో రద్దీ భారీగా పెరిగిందని వాపోయారు.  ఇసుకేస్తే రాలనంత జనం ఉంటున్నారని తెలిపారు. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ఎంత రద్దీగా ఉందో చూడాలంటూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తున్నారు. కోచ్‌లు పెంచేలా మెట్రో అధికారులను ఆదేశించాలని సీఎం రేవంత్ కు విజ్క్షప్తి చేస్తున్నారు.

Spread the love