నవతెలంగాణ- డిచ్ పల్లి
వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలు, కళాశాలలను బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కోమిరే శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రగల్బాలు పలికి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడం దారుణమని మండిపడ్డారు. ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాలలో, పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలనే ప్రధాన డిమాండ్ తో బంద్ నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యావ్యవస్థ డీఈఓలను, ఎంఈఓ లను నియమించాలని విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్న ఎంఈఓలను నియమించకపోతే విద్యా సంవత్సరం ఎలా ముందుకు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రీయింబర్స్మెంట్ ను సకాలంలో విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు. గురుకులాలకు, కేజీబీవీలకు ప్రభుత్వ హాస్టళ్లకు పక్కాభవనాలను నిర్మించకపోవడం విడ్డూరమన్నారు. మన ఊరు మనబడి పథకం కింద అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీని వేంటనే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.అంతకు ముందు డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పుర్ గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను బంద్ చేయించారు. విద్యారంగాన్ని కెసిఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే పుట్టగతులు ఉండవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు వెంకటేశ్,నాయకులు విజయ్ తదితర నాయకులు పాల్గొన్నారు.