రాజస్థాన్‌లో అర్ధరాత్రి భూకంపం..

నవతెలంగాణ – జైపూర్‌: రాజస్థాన్‌లో అర్ధరాత్రి భూమి కంపించింది. శనివారం అర్ధరాత్రి 11.47 గంటలకు సికార్‌, చురు, నాగౌర్‌ జిల్లాల్లో కొన్ని సెకన్లపాటు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.2గా నమోదయింది. సికార్‌ జిల్లాలోని హర్ష పర్వత వద్ద భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగుతు తీశారు. కాగా, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు.

Spread the love