అక్కినేని హాస్పిటల్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అక్కినేని మహిళా హాస్పిటల్‌ పైఅంతస్తులో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు, వారి సహాయకులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రోగులకు ఎలాంటి అపాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు, అగ్నిమాపక సిబ్బంది కూడా రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. రోగులకు ఎటువంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, స్వల్పంగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అనుమానిస్తున్నారు.

Spread the love