బీఆర్ఎస్ పార్టీ లోకి వలసలు

నవతెలంగాణ -పెద్దవూర: నాగార్జున సాగర్ నియోజకవర్గం మండలం, పులిచర్ల, పొట్టేవాని తాండా గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి మంగళవారం హాలియా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చెరారు. పార్టీ లో చేరిన మాజీ సర్పంచ్ వీరబోయిన వెంకటయ్య, వార్డు మెంబెర్ రామారావు, యూత్ నాయకులు అఖిల్, గోపి వీరితోపాటు 100 కుటంబాలు పార్టీ లో చేరడంతో వారికీ భగత్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ అబ్బీడి కృష్ణా రెడ్డి, పాక్స్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్ సర్పంచ్లు దాసరి సైదమ్మ నాగయ్య, శంకర్, ఎంపీటీసీ దేవసాని లక్ష్మమ్మ పుల్లారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు బుడిగాపాక లక్ష్మయ్య, ఉప సర్పంచ్లు బొడ్డుపల్లి చిరంజీవి, మాజీ సర్పంచ్ వెంకటయ్య, విజయ దశ్రు, శ్రీకర్ నాయక్, శివాజీ నాయక్, రవి నాయక్, బాలాజీ, రమేష్, జిల్లా కొండల్, చంద్ర శేఖర్, వినోద్, సేవా, తిరుమల్, అశోక్, రాజు, యల్లయ్య గౌడ్, సత్యనారాయణ, నారయ్య, అంజి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love