నవతెలంగాణ చివ్వేంల: సూర్యాపేట, త్రిపురారం, పెద్దవూర, చందంపేటలకు చెందిన మినీ గురుకులాల సిబ్బంది బుధవారం నల్గొండ ఆర్ సిఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మినీ గురుకులాలలో పనిచేసే సిబ్బంది న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మినీ గురుకులాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.