కనీస వేతనం ప్రకటించి ఉద్యోగ భద్రత కల్పించాలి..

నవతెలంగాణ -ఆర్మూర్ 
అంగన్వాడి టీచర్ల సమస్యలను పరిష్కారం చేసి కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.. అని సిపిఐ ఎంఎల్ ప్రజాపంధ రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ తెలిపారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా  డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు ,ఆయాలు గత 8రోజులుగా చేస్తున్న సమ్మెకు సోమవారం సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా  జిల్లా నాయకులు బి దేవారం.. లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాకముందు కేసీఆర్ ఎవరు కూడా రోడ్లమీద ధర్నాలు కానీ రాష్ట్ర రోకోలు కానీ చెయ్యని స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుందామని ఆనాడు ప్రజల బాలు పలికిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించుకొని గత పది సంవత్సరాలలో కెసిఆర్ అనేక రకాల ప్రజలను తీవ్ర ఇబ్బందులను పెడుతూ వారి హక్కులను కాల రాస్తున్నారని వారు అన్నారు మరోవైపు అంగనవాడి టీచర్లు మరియు ఆయాలు గత ఎనిమిది రోజులుగా వారి న్యాయమైన డిమాండ్లను సాధించాలని చేస్తున్న సమ్మె కేసీఆర్ మరియు ఇతర మంత్రులకు కనబడటం లేదా అని వారు ప్రశ్నించారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని దాన్ని పక్కన పెట్టడం జరిగిందని వారు అన్నారు నేడు కేసీఆర్ లక్షల జీతాలను తీసుకుంటూ కేవలం అరకుర వసతులతో చాలీచాలని జీతాలతో గడుపుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు ఆయా ల జీతాలను 26 వేల రూపాయలను పెంచాలని వారి డిమాండ్ చేశారు అదేవిధంగా ఉద్యోగ భద్రతను కల్పించాలని వారికి ఉన్న హక్కులను కల్పించాలని వారు అన్నారు వెంటనే కేసీఆర్ ప్రభుత్వం అంగన్వాడి టీచర్ల సమ్మెను విరమింపజేసి వారి సమస్యలను పరిష్కారం చేయాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపంతా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు ఏం ముత్తెన్న సారా సురేష్, సీఐటీయూ మండల నాయకులు కుతడి ఎల్లయ్య, సీపీఎం మండల నాయకులు భూమన్న, ప్రజపంథా డివిజన్ నాయకులు బి కిషన్, ఎం నరేందర్ అశోక్, రాజు అరవింద్, దుర్గాప్రసాద్, అంగన్వాడి టీచర్ల సంఘం అధ్యక్షురాలు చంద్రకళ, అరుణ, జగదాంబ, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love