పీస్‌రేట్‌ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి

– అన్‌మెన్డ్‌ కార్మికులను ఆర్టిజెన్లుగా గుర్తించాలి : యూఈఈయూ నేతల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న పీస్‌రేట్‌ కార్మికులకు కనీస వేతనాలివ్వాలనీ, అన్‌మెన్డ్‌ కార్మికులను ఆర్టిజెన్లుగా గుర్తించాలని తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూని యన్‌ డిమాండ్‌ చేసింది. గురువారం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ యూనియన్‌ సమావేశం జరిగింది. అందులో ఆ యూనియన్‌ అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.స్వామి ఎల్‌ఎమ్‌, సహాయ ప్రధాన కార్యదర్శి జె. ప్రసాద్‌రాజు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జి.సుధాకర్‌, ట్రెజరర్‌ జె.బసవరాజు, రాష్ట్ర నాయ కులు కె.రమేశ్‌, టి.లక్ష్మయ్య, సత్యనారాయణ, నర్సిం హులు, బాలరాజు, వై.రాజా, టి.రత్న, మోహన్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్‌ శాఖలో బిల్‌కలెక్టర్లు, మీటర్‌ రీడర్లు, అన్‌మెన్డ్‌ కార్మికులు, ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేరింగ్‌ సెంటర్లలో పనిచేసే కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, పీఎఏలు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ శాఖలో చేసిన వేతన ఒప్పందం వీరిలో ఒక్క రికి కూడా వర్తించడం లేదని వాపోయారు. మీటర్‌ రీడింగ్‌, బిల్‌ కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తుండటంతో వల్లనే ఆ శాఖకు కస్టమర్ల నుంచి బిల్లులు సకాలంలో వసూలవుతున్నాయని చెప్పారు. అంతటి కీలకమైన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. అన్‌మెన్డ్‌ కార్మికులకు తప్ప మిగిలిన కార్మికులందరికీ పీస్‌రేట్‌ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తున్నారని చెప్పారు. నెలంతా కష్టపడితే రూ.3 వేల నుంచి రూ.4 వేలు కూడా రావడం లేదని తెలిపారు. ఆ జీతంతో ఎలా బతకాలో యాజమాన్య మే చెప్పాలని ప్రశ్నించారు. బిల్‌కలెక్టర్లు, మీటర్‌ రీడర్లు, పీఏఏలు, ఎస్‌పీఎం కార్మికులకు కనీస వేత నాల జీవో 11 ప్రకారం జీతాలి వ్వాలని కోరారు. పీస్‌రేట్‌ అనే పదాన్ని తీసేయాలని విజ్ఞప్తి చేశారు. అన్‌మెన్డ్‌ కార్మికులను అర్టిజెన్లుగా గుర్తించాలనీ, అంత వరకు వారికి స్కిల్డ్‌ వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. వారందరికీ ఈఎస్‌ఐ, ఈపీ ఎఫ్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. సెక్యూరిటీ గార్డుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలి : కె.ఈశ్వరరావు
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, ఆలిండియా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను వెంటనే ఆరెస్టు చేయాలని తెలంగాణ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లా యీస్‌ యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె. ఈశ్వర్‌ రావు డిమాండ్‌ చేశారు.గురువారం హై దరాబాద్‌లోని సుంద రయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆ యూనియన్‌ ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం చేపట్టారు. రెజ్లర్లపై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలి..అరెస్టు చేయాలి.., రేపిస్టులకు అండ నా? ..బాధితులపై కేసులా? సిగ్గుసిగ్గు…’ అంటూ యూనియన్‌ నాయకులు నినాదాలు చేశారు. ప్లకార్డు లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌ రావు మాట్లాడుతూ.. ఒలిం పిక్స్‌లో పతకాలు తీసుకొచ్చిన రెజ్లర్లతో బ్రిజ్‌భూషణ్‌ అసభ్యకరంగా లైంగిక చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. ప్రపంచ పోటీల్లో గాయపడ్డ క్రీడాకారిణిని పట్టుకుని తన లైంగిక కోరిక తీర్చితే వైద్య ఖర్చులన్నీ భరిస్తానని అతడు మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గులకు కేంద్రంలోని మోడీ సర్కారు వంత పాడటాన్ని బట్టి బీజేపీకి మహిళల పట్ల ఎలాంటి వైఖరి ఉందో అర్థం అవుతున్నదన్నారు.

Spread the love