నవతెలంగాణ-కొడకండ్ల
దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథం లో నడుస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు ఏడు నూతల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరి స్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో 2023 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించేందుకు కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నారు. త్వరలోనే అర్హులైన అందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు రేషన్ కా ర్డులు మహిళా సాధికారత పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజవర్గం లోని ప్రతీ మండలంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం నర్సింగాపురం గ్రామంలో నూతన పంచా యతీ భవనానికి ఎస్సీ కమిటీ బహునానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఉమ్మడి వరంగల్ డిసిసిబి వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాము, ఈజీఎస్ డైరెక్టర్ యాకయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రామోజీ, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ వెంకటేశ్వరరావు, స్థానిక సర్పంచ్ మధు సూదన్,ఎంపీటీసీ విజయలక్ష్మీ, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ లు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రికి కాంగ్రెస్ నేతల వినతి
కొడకండ్ల మండలం అభివృద్ధి సంక్షేమ విషయంలో పూర్తిగా వెనుకబడి పో యిందని పట్టణ కాంగ్రెస నేతలు ఆరోపించారు. మండలంలో ఐటిఐ, పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల మంజూరు చేయాలని, అసంపూర్తిగా ఉన్న సబ్ రిజిస్టర్ బిల్డింగ్ పనులను త్వరితగా పూర్తి చేయాలని, అద్దె భవనంలో ఉన్న ఐసీడీఎస్ కార్యాల యానికి సొంత భవనం నిర్మించాలని, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి జలాల్పురం రో డ్డు వరకు బీటీ రోడ్ నిర్మాణం చేపట్టాలని, బస్టాండ్ చౌరస్తా నుండి తిరుమలగిరికి నూతన రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి ఎర్ర బెల్లి దయార్‌రావుకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్, నాయకులు బత్తుల వెంకన్న, మా ర్గం రవీందర్, వంశీ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.