శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

నవతెలంగాణ- హైదరాబాద్‌: వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సతీసమేతంగా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు వారికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు.  ఆలయం వెలుపల మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని, సీఎం కేసీఆర్  నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

Spread the love