నవతెలంగాణ – మెదక్: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏడుపాయల శ్రీ వన దుర్గాదేవి అమ్మవారిని హరీశ్‌రావు దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ఏడుపాయల యాగశాలను ప్రారంభించారు. ఆలయ పండితులు నిర్వహించిన యాగంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.