మంత్రి హరీష్‌ రావు సుడిగాలి పర్యటన

నవతెలంగాణ-ఆమనగల్‌
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదివారం ఆమనగల్‌ పట్టణంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.17.50 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.1.25 కోట్లతో నూతనంగా నిర్మించిన శాఖ గ్రంథాలయం భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఆమనగల్‌ మున్సిపాలిటీలో రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా సంచార వైద్య వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి పర్యటన సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాల ఎస్‌ఐలు బాల్‌ రామ్‌, హరిశంకర్‌ గౌడ్‌ తదితరులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నేనావత్‌ అనురాధ పత్య నాయక్‌, విజితా రెడ్డి, జర్పుల దశరథ్‌ నాయక్‌, ఉప్పల వెంకటేష్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌ గుప్తా, ఆమనగల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, తలకొండపల్లి మండల ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్‌, వైస్‌ ఎంపీపీ జక్కు అనంత్‌ రెడ్డి, రాంనుంతల సర్పంచ్‌ వడ్త్యావత్‌ సోనా శ్రీను నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు దోనాదుల కుమార్‌, సరిత పంతు నాయక్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ శ్రీధర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌, కౌన్సిలర్లు కమటం రాధమ్మ వెంకటయ్య, నేనావత్‌ సోనా జైరామ్‌ నాయక్‌, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, నాయకులు పొనుగోటి అర్జున్‌ రావు, నేనావత్‌ పత్య నాయక్‌, తల్లోజు రామకష్ణ, సయ్యద్‌ ఖలీల్‌, చుక్క నిరంజన్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Spread the love